Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 00:08:35 IST

ఆ సినిమా నా ఇంటి పేరు మార్చేసింది

twitter-iconwatsapp-iconfb-icon

కెమెరామెన్‌లు మెగాఫోన్‌ పట్టడం సహజమైన విషయం. ఈ జాబితాలో అంజి కూడా చేరిపోయారు. యాభై చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారాయన. వాటిలో ‘గరుడవేగ’ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’తో ‘యాక్షన్‌.. కట్‌..’ చెప్పేశారు. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అంజి చెప్పిన ‘టెన్త్‌ క్లాస్‌’ ముచ్చట్లు. ‘‘చాలా ఆహ్లాదకరంగా సాగే సినిమా ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. ఎమోషన్‌, డ్రామా, వినోదం అన్నీ ఉంటాయి. నిర్మాత అచ్యుత రామారావు చెప్పిన కథ ఇది. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల్ని నాకు చెప్పారు. అవి నన్ను కదిలించాయి. ఆ కథని నేను పూర్తిగా ఆకళింపు చేసుకొని, నాదైన స్టైల్‌లో తెరకెక్కించాను. అటు సినిమాటోగ్రఫీ, ఇటు దర్శకత్వం రెండూ హ్యాండిల్‌ చేయగలను అనే నమ్మకం వచ్చాకే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. నా జీవితాన్ని మార్చేసిన సినిమా ‘గరుడవేగ’. ఆ తరవాత.. అది నా ఇంటిపేరు అయిపోయింది. ఇప్పుడంతా నన్ను ‘గరుడవేగ అంజి’ అనే పిలుస్తారు. దర్శకత్వం, ఛాయాగ్రహణం రెండూ నాకు ఇష్టమే. నాకు నచ్చిన కథ వచ్చినప్పుడు డైరక్షన్‌ చేస్తా. ఛాయాగ్రహకుడిగానూ కొనసాగుతా’’ అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International