వర్షం వస్తే అంతే!

ABN , First Publish Date - 2021-05-13T06:46:39+05:30 IST

మడకశిర మేజర్‌ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారి ఏళ్లు గడుస్తున్నా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మెరుగు పడలేదు.

వర్షం వస్తే అంతే!
అమరాపురం బస్టాండు సమీపంలో ప్రదాన రహదారిలో మురుగు


జలమయమవుతున్న మడకశిర వీధులు, రహదారులు

మడకశిర అర్బన్‌, మే 12: మడకశిర మేజర్‌ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారి ఏళ్లు గడుస్తున్నా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మెరుగు పడలేదు. ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు డ్రైనేజీలోని మురుగునీరు రోడ్లపై చేరి చిత్తడిగా మారుతున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రదాన రహదారులు, వీధులు వర్షం నీటితో బురదమయమయ్యాయి. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి. వార్డులల్లోని వీధులతో పాటు ప్రదాన రహదారులకు డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉండడంతో వర్షం వస్తే అందులోని మురుగంతా రోడ్లపైకి వచ్చి వాహనదారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ంలోని వైఎ్‌సఆర్‌ సర్కిల్‌ నుంచి మధుగిరి సర్కిల్‌ వరకు ప్రదాన రహదారి వర్షపునీరు, మురుగునీటితో బురదమయమవుతున్నాయి. ఈ రహదారిలో బ్యాంకులు, కళాశాలలు, వ్యాపారసముదాయాలు ఉంటూ మురుగునీటి కారణంగా వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

 మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే అధికారులు నిత్యం ఆ ప్రదాన రహదారి గుండానే వెళ్తున్నా చూసీ చూడనట్లు వెళ్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అసలే కరోనా పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలకు ప్రదాన రహదారులపై మురుగు,అపరిశుభ్రతతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి సత్వరమే డ్రైనేజీలకు మరమ్మతులు చేపట్టి మురుగునీరు రోడ్లపై చేరకుండా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-13T06:46:39+05:30 IST