Abn logo
Mar 6 2021 @ 02:48AM

అదో రాజకీయ వ్యాఖ్యానం

భారత్‌కు ఎవరూ సుద్దులు చెప్పక్కర్లేదు

ఫ్రీడం హౌస్‌ నివేదికపై మండిపడ్డ కేంద్రం


న్యూఢిల్లీ, మార్చి 5: భారత్‌లో ఉన్నది పాక్షిక స్వేచ్ఛేనని, సంపూర్ణ స్వేచ్ఛాయుత దేశం కాదనీ, నరేంద్ర మోదీ హయాంలో హక్కుల అణచివేత సాగుతోందంటూ ఫ్రీడం హౌస్‌ అనే మేధోబృందం ప్రకటించిన నివేదిక తప్పుల తడక అని కేంద్రం మండిపడింది. ‘ఫ్రీడం హౌస్‌ ప్రకటించినది ఓ రాజకీయ వ్యాఖ్యానం. ఆ సంస్థ దేశాల సరిహద్దులు కూడా తెలుసుకోకుండా పటాలను (మ్యాప్‌లను) తప్పుడుగా చిత్రీకరిస్తుంటుంది. ఇదీ అంతే! స్వేచ్ఛపై వెల్లడించిన అభిప్రాయాలు పూర్తిగా అవాస్తవాలు, వక్రభాష్యాలు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాకు చెప్పారు. మూలాలే సరిగా లేనివారు తమకు సుద్దులు చెప్పవద్దంటూ ఆయన ఘాటుగా అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement