అటు ఆనందం - ఇటు ఆందోళన

ABN , First Publish Date - 2021-07-23T05:08:58+05:30 IST

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నా మరో వైపు ఆందోళన కలిగిస్తున్నాయి.

అటు ఆనందం - ఇటు ఆందోళన
వర్షానికి ఊపిరి పోసుకుంటున్న వరిపంట

గోపవరం, జూలై 22: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నా మరో వైపు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొందరు వరినాట్లు వేస్తుండగా ఇప్పటికే సజ్జ, పత్తి పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడు లు కూడా రావని ఆవేదనకు లోనవుతున్నా రు.  గోపవరం, బేతాయపల్లె, బెడుసుపల్లె, రాచాయిపేట తదితర ప్రాంతాల్లో సజ్జ పం ట సాగు చేశారు. ప్రస్తుతం ఇది పొట్టదశ లో ఉంది. సుమారు 400 ఎకరాలకు పైగా సాగు చేసిన పంట ప్రస్తుత వర్షాలకు దెబ్బతింటుందేమోనన్న ఆందోళనలో రైతన్నలు న్నారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే సజ్జ పూర్తిగా దెబ్బతింటుందని, పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు.

కాల్వపల్లె పంచాయతీలో కొన్ని చోట్ల వరి సాగులో ఉండగా మరికొన్ని చోట్ల పత్తి సా గులో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి పంటకు అనుకూలమైతే, మట్టి కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-23T05:08:58+05:30 IST