కేంద్రం ఆ పని చేస్తే రైతులు ఇంటికెళ్తారు: మేఘాలయ గవర్నర్

ABN , First Publish Date - 2021-11-24T23:49:09+05:30 IST

రైతుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. వారి ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర. ప్రభుత్వం దీనిని అంగీకరించి వెంటనే దీనిపై కమిటీ వేయాలి. ఈ పని చేసినట్లైతే రైతులు ఆందోళన విరమించి ఇంటికి వెళ్తారు..

కేంద్రం ఆ పని చేస్తే రైతులు ఇంటికెళ్తారు: మేఘాలయ గవర్నర్

షిల్లాంగ్: రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర అని, రైతుల మిగిలిన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినట్టుగానే కనీస మద్దతు ధరను కూడా అంగీకరించి చట్టం చేయడానికి సిద్ధమైతే రైతులు ఆందోళన విరమించి ఇంటికి వెళ్తారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. బుధవారం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను రైతుల పక్షాన ఉంటానని, అయితే ఆందోళనను మరిన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నారు.


‘‘రైతుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. వారి ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర. ప్రభుత్వం దీనిని అంగీకరించి వెంటనే దీనిపై కమిటీ వేయాలి. ఈ పని చేసినట్లైతే రైతులు ఆందోళన విరమించి ఇంటికి వెళ్తారు. అలాగే రైతులకు కూడా నేను ఒక విజ్ణప్తి చేయాలని అనుకుంటున్నాను. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తుంది. దయచేసి ఇంటికి వెళ్లిపోండి. ఆందోళన మరింత కాలం కొనసాగించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కనీస మద్దతు ధర అంశంలో నేను రైతుల పక్షాన్నే ఉంటాను’’ అని సత్యపాల్ మాలిక్ అన్నారు.

Updated Date - 2021-11-24T23:49:09+05:30 IST