సోదరితో అసభ్యంగా ప్రవర్తించాడని..

ABN , First Publish Date - 2020-06-06T10:48:24+05:30 IST

ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. లాక్‌డౌన్‌లో వారి మధ్య స్నేహం మరింత దృఢంగా మారింది. ఒకరింటికి ఒకరు

సోదరితో అసభ్యంగా ప్రవర్తించాడని..

స్నేహితుడిని హత్య చేసిన క్యాబ్‌ డ్రైవర్‌


లంగర్‌హౌస్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. లాక్‌డౌన్‌లో వారి మధ్య స్నేహం మరింత దృఢంగా మారింది. ఒకరింటికి ఒకరు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేక స్నేహితుడినే హతమార్చాడు మరొకరు. ఈ ఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన రాహుల్‌ అగ్రవాల్‌(33) మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతడి స్నేహితుడు అజార్‌ క్యాబ్‌ డ్రైవర్‌. అజార్‌ సోదరిపై రాహుల్‌ అగ్రవాల్‌ కన్నేశాడు. లాక్‌డౌన్‌లో ఈ విషయమై ఇద్దరి మధ్య రెండుమూడుసార్లు ఘర్షణ జరిగింది.


దీంతో అజార్‌ రాహుల్‌ అగ్రవాల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా అజార్‌ అతడి స్నేహితులు, రాహుల్‌ అల్జాపూర్‌ సమీపంలోగల శ్మశానవాటికలో గురువారం రాత్రి మద్యం తాగారు. అధికంగా మద్యం తాగి స్పృహ కోల్పోయిన రాహుల్‌ను  అజార్‌ స్నేహితులతో కలిసి అతడి తలపై బండరాళ్లతో మోది హతమార్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రధాన నిందితుడు అజార్‌ను అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శివమారుతి తెలిపారు. పూర్తి వివరాలు గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ వివరిస్తారని అన్నారు. ఘటన గురించి ఆయనను అడగగా వివరాలు చెప్పలేదు.

Updated Date - 2020-06-06T10:48:24+05:30 IST