ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది

ABN , First Publish Date - 2021-01-25T05:24:50+05:30 IST

ఓసీలో ఉన్న కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులస్థులను బీసీ‘డీ’లో కలిపిన ఘనత ముఖ్యమం త్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కా మారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులా ల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఙత సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత

కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులస్థులను బీసీ ‘డీ’లో చేర్చడం చారిత్రాత్మక నిర్ణయం : ఎమ్మెల్సీ కవిత

పిట్లం, జనవరి 24: ఓసీలో ఉన్న కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులస్థులను బీసీ‘డీ’లో కలిపిన ఘనత ముఖ్యమం త్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కా మారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులా ల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఙత సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓసీ గ్రూపులో ఉన్న వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీ కమిషనర్‌తో చర్చించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏనాడు ఓసీలను బీసీలో చేర్చలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ము ఖ్యమంత్రి కేసీఆర్‌ కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపు కులాలను బీసీ ‘డీ’లో చేర్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం భావితరాల కోసం గుర్తిండి పోయే విధంగా ముఖ్యమంత్రి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వరి పంట  పండించడంలో మన రాష్ట్రం ముందుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఆడబిడ్డగా అందరినీ ఆదుకుంటానన్నారు. జుక్కల్‌ నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్‌ నాగమడుగు లిఫ్ట్‌ ద్వారా బీడు భూములను సాగులోకి తెచ్చారన్నారు. జుక్కల్‌ ప్ర జాప్రతినిధులు తనకు ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. అనంతరం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని రుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షే మ పతకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆ యన అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మా ట్లాడుతూ.. జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చెసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. అదే విధంగా పిట్లంలో ప్రభు త్వ ఆసుపత్రి 30 పడకల భవనం, బాన్సువాడ-పిట్లం రెం డు వరుసల రహదారి పనులు, నిధులు మంజూరు చే యాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశం లో కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభ, ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి. సర్పంచ్‌ విజ యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ సుధాకర్‌ రావు, చిట్టెపు రాష్ట్ర అధ్య క్షుడు శివసాయి పటేల్‌, కార్యదర్శి గంగా ప్రసాద్‌తో పాటు సంగారెడ్డి, వికారాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, భైంసా  జిల్లాల కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-25T05:24:50+05:30 IST