Sep 29 2021 @ 01:33AM

అది వదంతే... నిజం కాదు!

అక్కినేని నాగచైతన్య, సమంత వైవాహిక జీవితంపై వదంతులెన్నో వినిపిస్తున్నాయి. దంపతులిద్దరూ ఇప్పటివరకూ వాటిపై నేరుగా స్పందించలేదు. అయితే... వ్యక్తిగతంగా కొంత బాధ కలిగించే విషయయే అయినప్పటికీ, టీఆర్పీల కోసం సృష్టించేవి ఎక్కువ రోజులు ప్రజల మనస్సులో ఉండవని, ఏది నిజమో అదే ఉంటుందని ఈమధ్యే చైతన్య పరోక్షంగా స్పందించారు. ‘సాకి’ బ్రాండ్‌తో వస్త్రరంగ వ్యాపారంలో ప్రవేశించిన సమంత, ‘సాకి’ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ‘మీరు ముంబైకి షిఫ్ట్‌ అవుతున్నారా?’ అని ఒకరు ప్రశ్నించగా... ‘‘నాకు నిజంగా తెలియదు! ఈ వదంతులు ఎక్కడ ప్రారంభమవుతాయో? ఇతర వదంతుల్లా ఇదీ నిజం కాదు. హైదరాబాద్‌ నా ఇల్లు. ఎప్పటికీ నా ఇల్లుగానే ఉంటుంది. హైదరాబాద్‌ నాకు ఎంతో ఇచ్చింది. చాలా సంతోషంగా ఇక్కడే జీవిస్తా’’ అని సమంత చెప్పారు. అదీ సంగతి!