Abn logo
Oct 17 2021 @ 02:39AM

అదిగో చిరుత

పరిపాలనా భవనం ఎదుట సంచరిస్తున్న చిరుత

వెటర్నరీ వర్సిటీలోని సీసీ కెమెరాకు చిక్కడంతో కలకలం 


తిరుపతి(విద్య), అక్టోబరు 16: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఇటీవల చిరుత సంచారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే మూడుసార్లు కనిపించడం వర్సిటీ వర్గాలను కలవర పెడుతోంది. ఈనెల 10న చిరుత సంచరించినట్లు సీసీకెమెరాల్లో రికార్డవగా, గురువారం రాత్రి వర్సిటీ ప్రహరీపై ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి వీడియోలు తీసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం నాలుగు గంటల సమయంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ఉన్న రహదారి దాటుకుని పొదల్లోకి వెళ్లే చిరుత వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. నెల రోజులుగా వర్సిటీలో చిరుత సంచరించడంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.