బీహార్ ఎన్నికల బందోబస్తుకు 30వేల కేంద్ర బలగాలు

ABN , First Publish Date - 2020-09-28T12:48:22+05:30 IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది....

బీహార్ ఎన్నికల బందోబస్తుకు 30వేల కేంద్ర బలగాలు

న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా బీహార్ లోని 38 జిల్లాల్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.బీహార్ రాష్ట్రంలోని గయ, ఔరంగాబాద్ జాముయి, జెహ్నాబాద్, లఖీసరాయి తదితర జిల్లాలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో అక్కడ కేంద్ర బలగాలను అదనంగా మోహరించాలని నిర్ణయించారు. 


మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల పెట్రోలింగ్ ను ముమ్మరం చేయనున్నారు.80 కంపెనీల సీఆర్ పీఎఫ్, 50 కంపెనీల సీఐఎస్ఎఫ్, 30 కంపెనీల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, 55 కంపెనీల బీఎస్ఎఫ్, 70 కంపెనీల సహస్ర సీమాబల్,. 15 కంపెనీల ఆర్పీఎఫ్ బలగాలను బీహార్ కు పంపించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Updated Date - 2020-09-28T12:48:22+05:30 IST