రిషికేష్‌లో అమెరికా మహిళపై యువకుడి అత్యాచారం

ABN , First Publish Date - 2020-10-09T11:48:43+05:30 IST

అమెరికా మహిళ అత్యాచారానికి గురైన దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో జరిగింది....

రిషికేష్‌లో అమెరికా మహిళపై యువకుడి అత్యాచారం

రిషికేష్ (ఉత్తరాఖండ్): అమెరికా మహిళ అత్యాచారానికి గురైన దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో జరిగింది. అమెరికా దేశానికి చెందిన 37 ఏళ్ల మహిళ యోగా ఔత్సాహికురాలు. అమెరికా మహిళ రిషికేష్ లోని ఓ గదిలో నివాసముంటున్నారు. అక్టోబరు 5వతేదీన రిషికేష్ నివాసి అభినవ్ రాయ్ బాల్కనీ మీదుగా అమెరికా మహిళ ఉన్న గదిలోకి చొరబడి అత్యాచారం చేశాడని మునీకి రేటి పోలీసు అధికారి ఆర్కే సక్లానీ చెప్పారు. అమెరికా మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడు రాయ్ తండ్రి తనపై ఒత్తిడి తెస్తున్నారని అమెరికా మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 




అక్టోబరు 5వతేదీ అత్యాచారం ఘటనకు ముందు అభినవ్ రాయ్ అమెరికా మహిళను తన గదికి పిలిచి ఆమెను లైంగికంగా వేధించాడని పోలీసులు చెప్పారు. అమెరికా మహిళ యోగా పట్ల ఉన్న ఆసక్తితోనే అభినవ్ రాయ్ కు దగ్గర అయిందని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-10-09T11:48:43+05:30 IST