పనిచేస్తున్న ఇళ్లలో పనిమనిషి 44 చోరీలు

ABN , First Publish Date - 2020-10-26T17:15:04+05:30 IST

పనిచేస్తున్న ఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్న ఓ పనిమనిషిని...

పనిచేస్తున్న ఇళ్లలో పనిమనిషి 44 చోరీలు

ముంబై : పనిచేస్తున్న ఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్న ఓ పనిమనిషిని ముంబై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.ముంబైకు చెందిన వనితా గైక్వాడ్ బాండ్రాలోని ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి 1.8 లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజీ సాయంతో 34 ఏళ్ల పనిమనిషిని దొంగగా గుర్తించిన ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పనిమనిషి 1990 నుంచి పలు ఇళ్లలో పనిమనిషిగా వనితా గైక్వాడ్ పనిచేస్తూ 40కు పైగా చోరీలకు పాల్పడిందని వెల్లడైంది. ఆగస్టు నెలలో అంధేరిలో ఓ ఇంట్లో చోరీ చేసి అరెస్టు అయి బెయిలుపై విడుదలైంది.1990 నుంచి పనిమనిషి వనితా గైక్వాడ్ 44 చోరీలకు పాల్పడిందని పోలీసులు వివరించారు. జనవరిలో శాంతాక్రజ్ లోని ఓ ఫ్లాటులో పనిమనిషిగా చేరి రూ.5.3 లక్షల ఆభరణాలు దోచుకుంది. మరో చోరీ కేసులో 2019లో పనిమనిషి వనితా గైక్వాడ్ అరెస్టు అయిందని ముంబై పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-10-26T17:15:04+05:30 IST