Abn logo
Aug 22 2020 @ 10:47AM

శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టు పేరిట మోసం..13మందిపై కేసు

Kaakateeya

మధుర (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నగరంలో శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు పేరిట మోసగించి ప్రజలనుంచి విరాళాలు వసూలు చేసిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధుర నగరానికి చెందిన భగవతాచార్య ఆధ్వర్యంలో 13 మంది ట్రస్టు పేరిట విరాళాలు వసూలు చేశారు. శ్రీకృష్ణ జన్మస్థానంలో శ్రీకృష్ణజన్మభూమి నిర్మాణ న్యాస్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించి విరాళాలు వసూలు చేస్తున్నారని శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టు కార్యదర్శి కపిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 1944లో ఏర్పాటైన ట్రస్టు ఆలయ పునర్ నిర్మాణ పనులు చేపట్టిందని శర్మ పేర్కొన్నారు.ప్రజలను ట్రస్టు పేరిట మోసగించిన 13 మందిపై తాము ఐపీసీ సెక్షన్ 406, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మధుర పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement