'థ్యాంక్యూ': షూటింగ్ పూర్తి..

అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'థ్యాంక్యూ'. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూరైంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే గత ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. అయితే ఎట్టకేలకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తైందని సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఫొటోను షేర్ చేశారు. ఇక నాగ చైతన్య ఇటీవల 'లవ్ స్టోరి' మూవీతో వచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. కాగా చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఆమిర్ ఖాన్‌తో కలిసి 'లాల్ సింగ్ చద్దా' మూవీలో నటించాడు. ఈ మూవీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  


Advertisement