Jun 29 2021 @ 16:01PM

సెట్‌పైకి 'థ్యాంక్యూ'..?

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జూలై మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో మొదలవబోతోందని సమాచారం. ఇప్పటికే మేజారిటీ చిత్రీకరణ పూర్తిచేసింది చిత్ర బృందం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడిన సంగతి తెల్సిందే. మరో ఐదు రోజుల చిత్రీకరణ జరిపితే గుమ్మడికాయ కొట్టేస్తారట. ఈ తాజా షెడ్యూల్‌లో నాగ చైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కాగా 'థ్యాంక్యూ' విడుదలపై ఆగస్టులో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయట. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఇందులో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మ్యూజిక్ సెన్షేషన్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రీకరణకి సిద్దమవుతున్నాడు చైతు.