Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 20:14:06 IST

Thank You: టీజర్ రిలీజ్‪కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్

twitter-iconwatsapp-iconfb-icon

యువసామ్రాట్ (YuvaSamrat) నాగచైతన్య (Naga Chaitanya), దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కాంబినేషన్‪లో రూపొందుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’ (ThankYou). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‪లో దిల్ రాజు (Dil Raju)- శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన రాశీ ఖన్నా (Raashi Khanna), మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‪ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ ఆసక్తికర వీడియోతో పాటు.. టీజర్‪ని ఎప్పుడు విడుదల చేయబోతుందీ అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.


అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family)కి ‘మనం’ (Manam) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన విక్రమ్ కె. కుమార్.. ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోతో చేస్తున్న ఈ ‘థ్యాంక్యూ’ చిత్ర టీజర్‪ని.. మే 25న సాయంత్రం 5గంటల 04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఓ పోస్టర్‪ను విడుదల చేశారు. అంతకుముందు నాగచైతన్య డబ్బింగ్ చెబుతున్న వీడియోని యూనిట్ పోస్ట్ చేయగా.. అందులో ‘నిజంగా ఈ చిత్ర టీజర్‪ని విడుదల చేస్తున్నారా?’ అంటూ దర్శకుడిని చైతూ ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్‪తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ తర్వాత మరింతగా ఈ సినిమాపై క్రేజ్ పెరగడం ఖాయం అనేలా చిత్రయూనిట్ భావిస్తోంది. కాగా, లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram) ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి (BVS Ravi) కథను అందించగా.. నవీన్‌ నూలి (Naveen Nooli) ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement