Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 08 May 2022 09:44:56 IST

Thank You : విడుదల తేదీ ఫిక్స్ ?

twitter-iconwatsapp-iconfb-icon

అక్కినేని నవయువ సామ్రాట్ నాగచైతన్య (Naga chaitanya ) ‘లవ్‌స్టోరీ, బంగార్రాజు’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఈ రెండు విజయాలతో ఈ హీరో కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అతడితో సినిమాలు తీయడానికి బడా ప్రొడ్యూసర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య (Naga chaitanya ) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ (Thank You) చిత్రంలోనూ, ‘దూత’ (Dootha) అనే థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. అలాగే.. నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకి కూడా కమిట్ అవుతున్నాడు. వీటితో పాటు పరశురామ్ (Parasuram) దర్శకత్వంలోనూ చైతూ నటించబోతున్నాడు. ఇక ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకొని విడుదల ముంగిట నిలిచిన చిత్రం ‘థాంక్యూ’ (Thank You).  దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. మరి ఎందుకోగానీ.. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలో ఆలస్యంచేస్తూ వస్తున్నారు మేకర్స్. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. 

తాజా సమాచారం ప్రకారం ‘థాంక్యూ’ (Thank You) చిత్రాన్ని జూలై 7న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నారట. ఈ సినిమా విడుదలకు అది మంచి తేదీనే. రెండు నెలలు టైముంది కాబట్టి.. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో చేయొచ్చు. అయితే మరుసటి రోజు నితిన్ (Nithin)  ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాలూ భారీ బడ్జెట్ చిత్రాలు కాదు కాబట్టి.. వాటి మధ్య పోటీ అంతగా ఉండదని చెప్పుకోవాలి. అయితే దీనికి ఒక వారం ముందు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘రంగరంగ వైభవంగా’, మాధవన్ (Madhavan)  ‘రాకెట్రీ‘ సినిమాలు విడుదలై ఉంటాయి. సో ఈ సినిమాకి పోటీ తక్కువేమీ లేదు. 

రాశీఖన్నా (Rashi khanna)  హీరోయిన్ గా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో చైతూ .. హీరో మహేశ్ బాబు (Mahesh babu) కు వీరాభిమాని. అలాగే అతడో క్రికెటర్ కూడా. దీనికోసం ప్రత్యేకంగా ‘ఒక్కడు, పోకిరి’ కటౌట్లు వేసి షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో ఇంకా అవికా గోర్ (Avika gor) కూడా కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కంటెంట్ మాత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. మరి నిజంగానే థాంక్యూ చిత్రం జూలై 7న విడుదలవుతుందో లేదో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement