Thammineniపై కూన రవి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-27T21:05:01+05:30 IST

స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni Seetharam)పై టీడీపీ నేత కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Thammineniపై కూన రవి ఆగ్రహం

అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni Seetharam)పై టీడీపీ నేత కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మహానాడును వల్లకాడని తమ్మినేని మాట్లాడడం సరికాదన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేనిదని విమర్శించారు. తమ్మినేనిని ఆముదాలవలసలో సజీవ దహనం చేస్తారని హెచ్చరించారు. తమ్మినేని పాడె మోయటానికి కూడా ఎవరూ ఉండరన్నారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైసీపీకి గద్దె దించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు. వైసీపీ తన చితికి తానే నిప్పు పెట్టుకుంటోందని కూన రవి చెప్పారు.

Updated Date - 2022-05-27T21:05:01+05:30 IST