సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నాం: తమ్మినేని సీతారాం

ABN , First Publish Date - 2022-04-16T02:37:28+05:30 IST

సాంకేతిక సమస్యలు కారణంగా సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళంలోని

సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నాం: తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం: సాంకేతిక సమస్యలు కారణంగా సీపీఎస్‌ను పరిష్కరించలేక పోతున్నామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన ఏపీటీఎఫ్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి భేదాభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్ల బోధన అవసరమని, అలా అని తెలుగుభాషను విస్మరించడం జరగదన్నారు. ఏపీటీఎఫ్‌ ఉద్యమాలు చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. అనంతరం పూర్వ సమాచారహక్కు జాతీయ కమిషనర్‌,  మహేంద్రయూనివర్శిటీ సూల్‌ ఆఫ్‌ లా ఆచార్యుడు మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ నేటితరానికి విద్య నిరంతర లక్ష్యసాధన కావాలన్నారు. ఇందు కోసం ఉపాధ్యాయులంతా కృషి చేయాలని తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-04-16T02:37:28+05:30 IST