Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 11:34:55 IST

అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేసిన థమన్..

twitter-iconwatsapp-iconfb-icon
అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేసిన థమన్..

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్', 'భీమ్లా నాయక్', 'ఆచార్య' లాంటి రిలీజ్‌కు సిద్దమైన సినిమాలలోని పాటలు ఇప్పటికే రిలీజైయ్యాయి. కానీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. ఈ విషయంలో మహేశ్ అభిమానులు చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చే థమన్ కూడా 'సర్కారు వారి పాట' చిత్రానికి సంబంధించి ఆ మధ్య బాగానే పోస్టులు పెట్టారు. అందుకే, అభిమానులు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా థమన్ ఇచ్చింది కూడా ఓ పాటకు సంబంధించినదే అని పోస్ట్‌లో పెట్టిన మ్యూజిక్ నోట్ చూస్తే అనిపిస్తోంది. కానీ, అది 'సర్కారు వారి పాట' మూవీ గురించేనా అని మాత్రం తెలియడం లేదు. 'ఫిబ్రవరి 14' అంటూ ట్వీట్ చేశారు. ఇదేంటో అర్థం కాక అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఇది ఏ సినిమా గురించో థమన్ మరోసారి క్లారిటీగా పోస్ట్ పెడితేగానీ అందరికీ ఉన్న కన్‌ఫ్యూజన్స్ పోవు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement