Oct 24 2021 @ 08:01AM

Thaman: నవంబర్ 16న 'వకీల్ సాబ్' బీజీఎంను రిలీజ్ చేస్తాం..

మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ తాజాగా, 'వకీల్ సాబ్' మూవీ బీజీఎంను నవంబర్ 16న రిలీజ్ చేస్తామని తెలిపాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా వచ్చిన 'వకీల్ సాబ్' భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా, బోనీకపూర్ సమర్పణలో వచ్చిన ఈ మూవీకీ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిచాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో ప్రకాష్ రాజ్, నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'వకీల్ సాబ్' చూస్తున్నానని, నవంబర్ 16న ఈ మూవీ నుంచి 'వకీల్ సాబ్' బీజీఎంను నవంబర్ 16న రిలీజ్ చేస్తానని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక ఇదే సమయంలో ఆయన పదపద యువత అనే పాటను పాడాడు. కాగా థమన్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట', పవన్ కళ్యాణ్ - రానాల 'భీమ్లా నాయక్', మెగాస్టార్ మూవీ సహ పలు క్రేజీ మూవీస్‌కు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు.