Abn logo
Feb 25 2020 @ 12:44PM

తమన్ ట్వీట్ పవన్ గురించేనా?

`నేను ఎవరినైతే బాగా అభిమానించానో, ఏ హీరోతో కలిసి పనిచేయాలని కలలు కన్నానో ఆయణ్ని కలిశాను. నా మ్యూజిక్‌ను ఆయనకు వినిపించాను. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. త్వరలోనే ఆయన సినిమాలోని తొలి పాటతో మీ ముందుకు రాబోతున్నా` అంటూ సంగీత దర్శకుడు తమన్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


తమన్ చేసిన ఈ ట్వీట్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించేనని అందరూ అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో విజయవంతమైన `పింక్` తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇప్పటివరకు రివీల్ కాలేదు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది తానేనని తాజా ట్వీట్ ద్వారా తమన్ పరోక్షంగా వెల్లడించాడని అందరూ అనుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement