Gandhiji movie: ఐమాక్స్‌లో గాంధీజీ సినిమాను వీక్షించిన తలసాని, దానం

ABN , First Publish Date - 2022-08-09T17:14:44+05:30 IST

భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో 563 స్క్రీన్లలో గాంధీజీ సినిమా ప్రదర్శన జరుగుతోంది.

Gandhiji movie: ఐమాక్స్‌లో గాంధీజీ సినిమాను వీక్షించిన తలసాని, దానం

హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో 563 స్క్రీన్లలో గాంధీజీ సినిమా (Gandhiji movie) ప్రదర్శన జరుగుతోంది. ఇందులో భాగంగా ఐమాక్స్‌లో గాంధీజీ సినిమాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav),  ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagendar), విద్యాశాఖ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వీక్షించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ... దేశ భక్తి పెంపొందించాలని సీఎం కేసీఆర్ ఈ గాంధీజీ సినిమాను అందరికీ ఉచితంగా చూపిస్తున్నామన్నారు. సినిమా ఇండస్ట్రీతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. పిల్లలు ఉత్సాహంగా చూస్తున్నారన్నారు. స్వాతంత్య్రం  తీసుకొచ్చిన మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. 15 రోజుల పాటు ఉత్సవాలు తెలంగాణలో జరుగుతాయని తెలిపారు. పిల్లల్లో దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

Updated Date - 2022-08-09T17:14:44+05:30 IST