Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

తలకాయ కూర

తలకాయ కూర

వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. అయితే వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరాలంటే మటన్‌తో ఇలాంటి వంటలను ట్రై చేయండి.


కావలసినవి: మేక తలకాయ మాంసం - అరకేజీ, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాల - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, నల్ల జీలకర్ర - పావు టీస్పూన్‌.


తయారీ విధానం: స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేయాలి. కాసేపు వేగిన తరువాత తలకాయ మాంసం వేయాలి. తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.ఆవిరిపోయిన తరువాత కూరను పాన్‌లోకి మార్చుకుని మళ్లీ స్టవ్‌పై పెట్టాలి. మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాల, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి.కాసేపు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి.

చులే కా దమ్‌ ముర్గ్‌చులే కా దమ్‌ ముర్గ్‌దమ్‌ కీ నల్లీదమ్‌ కీ నల్లీపాలకూర చికెన్‌ కర్రీపాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ కరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌గోంగూర చికెన్‌నర్గీసి కబాబ్‌ కా కుర్మానర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకాలియా ఖాసా దో - ప్యాజ్‌కాలియా ఖాసా దో - ప్యాజ్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.