Abn logo
Jun 5 2020 @ 17:03PM

`తలైవి`కి రూ.55 కోట్లు?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. వాటిల్లో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న `తలైవి` చిత్రం. ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. కంగనతో పాటు పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 


ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొందట. అమేజాన్, నెటిఫ్లిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నాయట. హిందీ, తమిళ భాషలకు కలిపి రూ.55 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీ డిమాండ్ నెలకొందట. ఇంకా కొద్ది భాగం మాత్రమే షూటింగ్ మిగిలి ఉందట. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 

Advertisement
Advertisement
Advertisement