వాఘా సరిహద్దుల్లో అజిత్‌.. పిక్స్ వైరల్

కోలీవుడ్‌ చిత్రసీమలో ఉన్న అగ్ర నటుల్లో అజిత్‌ ఒకరు. ఆయన వ్యవహారశైలి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. స్టార్‌ హీరోగా ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించేందుకు ఆసక్తి చూపుతారు. రెండేళ్ళపాటు సాగిన ‘వలిమై’ షూటింగు ఇటీవలే పూర్తి చేసుకుంది. దీంతో అజిత్‌ ఉత్తరభారతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

ఇటీవలే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు వెళ్ళిన అజిత్‌... ఈనెల 19వ తేదీన ఇండో పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన వాఘా బోర్డర్‌కు వెళ్ళారు. అక్కడ భారత జవాన్లతో కలిసిపోయారు. అజిత్‌తో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు జవాన్లు పోటీపడ్డారు. అంతేకాకుండా, వాఘా సరిహద్దుల్లో జాతీయ జెండాను చేతపట్టుని ఫొటో దిగారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement