20 మంది మహిళలతో థాయ్ రాజు సెల్ఫ్ ఐసోలేషన్

ABN , First Publish Date - 2020-04-01T00:24:16+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా కుదిపేస్తోందో చూస్తూనే ఉన్నాం. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది. ఇదే సమయంలో

20 మంది మహిళలతో థాయ్ రాజు సెల్ఫ్ ఐసోలేషన్

బ్యాంకాక్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా కుదిపేస్తోందో చూస్తూనే ఉన్నాం. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది. ఇదే సమయంలో ప్రజలతో పాటు.. ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక దేశాల ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. కాగా.. థాయ్ లాండ్ రాజు మహా వాజిరాలోంగ్కోర్న్(67) కూడా కొద్ది రోజుల నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఈయన సెల్ప్ ఐసోలేషన్‌లో ఏకాంతంగా ఉండటం లేదు.. 20 మంది మహిళలతో కలిసి ఉన్నారట. పైగా థాయ్‌ల్యాండ్‌ను వదిలేసి జర్మనీలోని బవేరియాలో ఓ లగ్జరీ హోటల్‌ను బుక్ చేసుకుని.. అందులో ఈ మహిళలతో ఉంటున్నారు. దీంతో థాయ్‌ల్యాండ్ ప్రజలు థాయ్ రాజుపై విరుచుకుపడుతున్నారు. థాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే దాదాపు 1400 మంది కరోనా బారిన పడగా.. ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇలాంటి క్లిష్ల పరిస్థితుల్లో ప్రజలను వదిలేసి హోటల్‌లో మహిళలతో గడుపుతున్న వ్యక్తి తమకు అవసరం లేదంటూ మండిపడుతున్నారు. కాగా.. థాయ్ రాజుకు ఇప్పటికే నలుగురిని పెళ్లాడారు. మరి సెల్ఫ్ ఐసోలేషన్‌లో థాయ్ రాజు‌తో పాటు ప్రస్తుత భార్య కూడా ఉందా లేదా కేవలం ఇతర మహిళలతోనే విలాసవంతంగా గడుపుతున్నారా అన్నది తెలియదు. ఆ హోటల్‌లోకి ఎవరికీ ప్రవేశం లేకపోవడంతో లోపల ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-04-01T00:24:16+05:30 IST