Abn logo

థాయ్‌ గ్రీన్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు: మూడున్నర కప్పులు, కొబ్బరి లేదా ఆవాల నూనె: రెండు స్పూన్లు, నీళ్లు: రెండు కప్పులు, థాయి బేసిల్‌ ఆకులు: ఒకటిన్నర స్పూను పేస్టు కోసం.. పచ్చి మిర్చి, ఎండు మిర్చి: మూడు (సన్నగా తరిగినవి), అల్లం: చిన్న ముక్క, కొత్తిమీర: సగం కప్పు, ధనియాలు, సోయా సాస్‌: స్పూను చొప్పున, కొబ్బరి పాలు: మూడు స్పూన్లు, ఆలుగడ్డ, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌, క్యారట్‌, పుట్టగొడుగుల ముక్కలు: రెండు కప్పులు.


తయారు చేసే విధానం: ముందుగా కర్రీ పేస్టును చేసుకోవాలి. మిర్చీ; అల్లం, కొత్తిమీర; ధనియాలు గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి రెండు స్పూన్ల కొబ్బరి పాలనూ వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఓ ప్యాన్‌లో నూనె వేసి కాగాక కొద్దిగా పేస్టును జతచేసి వేయించాలి. ఆ తరవాత కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లను పోసి మూతపెట్టి కాస్త ఉడికించాలి. ఓ మోస్తరుగా ఉడికాక కొబ్బరిపాలను, మిగతా పేస్టునూ కలిపి ఇంకాస్త ఉడికిస్తే థాయ్‌ గ్రీన్‌ కర్రీ రెడీ. పైన బేసిల్‌ ఆకులతో గార్నిష్‌ చేయాలి. అన్నంతో అయినా పులావుతో అయినా థాయ్‌ గ్రీన్‌ కర్రీ టేస్టీగా ఉంటుంది.

కీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూరడుబ్కీ వాలే ఆలూషాహీ బిండీ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా
Advertisement