Jun 22 2021 @ 16:47PM

ఓటీటీలో ‘తేన్‌’.. విడుదల ఎప్పుడంటే..?

కోలీవుడ్‌: గత మార్చిలో థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రాల్లో ‘తేన్‌’ ఒకటి. సినీ అభిమానులతోపాటు... ప్రముఖులను కూడా అమితంగా ఆకర్షించిన ఈ చిత్రం.. కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా విడుదలకాలేదు. ఇపుడు ఈ వైరస్‌ ప్రభావం తగ్గినప్పటికీ.. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు నిర్మాత నిర్ణయించి, ఈ నెల 25న విడుదల చేయనున్నారు. గణేశ్‌ వినాయకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్‌ కుమార్‌, అపర్ణతి, అరుళ్‌దాస్‌, బాలలక్ష్మణన్‌, అనుశ్రీతో పాటు అనేక మంది నటించారు. శరత్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను హృదయాన్ని హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు. ఇప్పటికే అనేక చిత్రోత్సవాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ‘తేన్‌’ మూవీ.. 2020లో ఇండియన్‌ పనోరమా విభాగంలో ఎంపికైన రెండు చిత్రాల్లో ఒకటి కావడం గమనార్హం.