తడిసిన ధాన్యం.. కొనేదెవరు ?

ABN , First Publish Date - 2021-11-28T06:25:19+05:30 IST

ఎక్కడ చూసినా తడిసి ముద్దయిన వరి ధాన్యమే. కళ్లాలోను, రోడ్లపైనా ఆరబెట్టుకుంటున్న అన్న దాతలు. తడిసి ముద్దయి రంగు మారిన ధాన్యాన్ని ఎవరు కొంటారో చెప్పండి బాబూ అంటూ ప్రాఽథే యపడుతున్న అన్నదాతల దైౖన్యస్థితి చూసిన వారెవరైనా చలించక మానరు.

తడిసిన ధాన్యం.. కొనేదెవరు ?
అయినవిల్లి మండలం నేదునూరులో ముంపు బారిన పడ్డ పంట పొలాన్ని చూపిస్తున్న రైతు... అక్కడే తడిసి ముద్దయి రంగు మారిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న దృశ్యం

 తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు 

 ఆంక్షలు సడలించాలని డిమాండు

 ప్రభుత్వమే కొనుగోలు చేయకపోతే ఎలాగంటూ ఆవేదన

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఎక్కడ చూసినా తడిసి ముద్దయిన వరి ధాన్యమే. కళ్లాలోను, రోడ్లపైనా ఆరబెట్టుకుంటున్న అన్న దాతలు. తడిసి ముద్దయి రంగు మారిన ధాన్యాన్ని ఎవరు కొంటారో చెప్పండి బాబూ అంటూ ప్రాఽథే యపడుతున్న అన్నదాతల దైౖన్యస్థితి చూసిన వారెవరైనా చలించక మానరు. జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగింది. వర్షాలకు పంట చేలన్నీ నేలనంటాయి. వర్షపు నీటిలోనే వారం రోజులపాటు తడిసి ముద్దకావడంతో కొన్నిచోట్ల వరి కంకులు మొలకెత్తుతుంటే మరికొన్నిచోట్ల రంగు మారే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసి ముద్దయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎటువంటి  ఆదేశాలు ఇవ్వకపోవడంతో కళ్లాల వద్దే ధాన్యపు రాశులు నిల్వచేసి కొనే నాథుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం సంభవించడం ద్వారా లక్ష మందికిపైగా రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు పంట నష్టం అంచనాలను నమోదు చేసేందుకు అధికారుల బృందాలు గ్రామాల్లో సర్వేలు కొనసాగిస్తున్నారు. వర్షాల వల్ల ముఖ్యంగా ధాన్యం తడిసి ముద్దయిందే ఎక్కువగా ఉంది. రైతులు సమీపంలోని కళ్లా లోను, రోడ్లపైనా వేసి ఆరబెడుతున్నారు. తేమశాతం తక్కువగా ఉంటేగానీ కోనే పరిస్థితి లేదంటూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాల్లో అధికారులు సవాలక్ష నిబంధనలు విధించడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలతోపాటు మిల్లర్లు, వ్యాపారులు మానవతా దృక్పథంతో స్పందిస్తే తప్ప రైతులు కోలుకోలేరని నల్లచెరువుకు చెందిన రైతు వర్రే వెంకటసత్యనారాయణ ఆవేదన చెందుతున్నారు. తనకున్న సొంత భూమితోపాటు కౌలుకు చేసిన మొత్తం ఎనిమిది ఎకరాల భూమిలో చేనంతా నేలనంటింది. భారీ వర్షాల వల్ల పనలన్నీ తడిసి ముద్దవ్వడంతో అవి కోసేందుకు కూలీలు సైతం ముందుకు రావడంలేదని, ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు విష యంలో ఆంక్షలను సడలించి కొంటే తప్ప జిల్లాలో మునకకు గురైన రైతుకు న్యాయం జరగదని ఆ ప్రాంతానికి చెందిన పలు వురు రైతులు పేర్కొంటున్నారు. వేల క్వింటాళ్ల ధాన్యం ఎక్కడిక క్కడే సిద్ధంగా ఉందని, అయితే తేమ శాతం విషయంలో ప్రభు త్వం కొంతమేర ఆంక్షలు సడలించి తడిసిన ధాన్యం కొనేలా చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెలాఖరు నాటికి మళ్లీ బం గాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయన్న వాతావరణ శాఖ  హెచ్చరిక అన్నదాతల్లో మళ్లీ గుబులు పుట్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ఎండలు కాస్తుండడం వల్ల పంట చేలను మాసూలు చేసుకునే పనిలో పడగా, మళ్లీ వర్షాలొస్తే రైతున్న పరిస్థితి అగమ్యగోచరమే.



Updated Date - 2021-11-28T06:25:19+05:30 IST