ఉద్యోగుల సమస్యలపై సీఎస్ ను కలిసిన టీజీవో నేతలు

ABN , First Publish Date - 2022-01-03T23:09:14+05:30 IST

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఉద్యోగుల సమస్యలపై సీఎస్ ను కలిసిన టీజీవో నేతలు

హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఉద్యోగుల సీనియారిటీ సమస్యలు, మల్టీజోనల్ కేడర్ లో కేటాయించబడ్డ ఉద్యోగులను స్టేట్ యూనిట్ గా తీసుకోవాలన్నారు. వారికి పోస్టింగ్ లు ఇవ్వాలని, భార్య భర్తలు ఒకే చోటకు కేటాయించేటట్టు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అందరు ఉద్యోగులను సర్ధుబాటు చేయాలన్నారు. భార్యాభర్తలలో ఎవరో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి ఒకే చోట ఉండేటట్లు నియమించాలన్నారు. 


దీనిని ముఖ్యమంత్రి ఆదేశంగా భావించాలని, మల్టీజోనల్ ఉద్యోగులకు పరస్పరం బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. గతంలో స్టేట్ కేడర్ లో పనిచేసిన ఉద్యోగులను ఇప్పుడు కేటాయిస్తున్న మల్టీజోనల్లో నియమించే బదులు వారికి పూర్తి స్వేచ్చనిచ్చి,రాష్ట్రంలో ఎక్కడైనా పని చేసేటట్లుగా అనుమతించాలన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ను కలిసిన వారిలో టీజీవో కేంద్ర సంఘం ప్రెసిడెంట్ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీవో నగర శాఖ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-01-03T23:09:14+05:30 IST