మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను ఖండించిన టీజీవో నేతలు

ABN , First Publish Date - 2022-03-03T22:41:13+05:30 IST

తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించి, రాష్ట్రం వచ్చాక మంత్రిగా సమర్దంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర సంఘటనను నిరసిస్తూ టీజీవో భవన్ లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ తరపున ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం సమావేశమై తీవ్రంగా ఖండించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను ఖండించిన టీజీవో నేతలు

హైదరాబాద్: తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించి, రాష్ట్రం వచ్చాక మంత్రిగా సమర్దంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర సంఘటనను నిరసిస్తూ టీజీవో భవన్ లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ తరపున ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం సమావేశమై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ ఎం. రాజేందర్, సెక్రటరీ జనరల్ వి. మమత మాట్లాడుతూ తెలంగాణలో హత్యారాజకీయాలకు తావులదని, మంత్రి శ్రీనివాస్ గౌడ్  చేస్తున్న మంచి కార్యక్రకమాలను చూసి గిట్టని వ్యక్తులు ఆయన హత్యకు కుట్ర చేయడం దుస్సాహసమని అన్నారు. కుట్రదారుల దిష్టిబొమ్మలను నాంపల్లిలోని గెజిటెడ్ భవన్ ఎదుట దగ్ధం చేశారు.


ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ముందే అప్రమత్తమై సమాచారం అందించి మంత్రికి రక్షణగా నిలిచిన పోలీసులను వారు ప్రశంసించారు. అనంతరం డీజీపీని కలిసి దోషులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారయణ,ప్రధాన కార్యదర్శి ప్రతాప్, రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-03T22:41:13+05:30 IST