రూ.1.25 కోట్లతో సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-05-17T05:17:42+05:30 IST

సామాజక సేవా కార్యక్రమాలు ప్రజలు మరింత మరింత విస్తృతస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని, రూ.1.25 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ తెలిపారు.

రూ.1.25 కోట్లతో సేవా కార్యక్రమాలు
కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎంపీ టీజీ

  1.  కర్నూలు, పరిసర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.65 లక్షలు
  2.  ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.60 లక్షలు 
  3.  రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌


కర్నూలు (కల్చరల్‌), మే 16: సామాజక సేవా కార్యక్రమాలు ప్రజలు మరింత మరింత విస్తృతస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని, రూ.1.25 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ తెలిపారు. ఆదివారం ఆయన తన పుట్టినరోజు వేడుకను నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వంద మంది పేద కళాకారులకు రూ.లక్ష విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కళాక్షేత్రంలో కొత్తగా సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు నిర్మించిన టీజీవీ కళా సాహితీ వేదిక హాలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ మాట్లాడారు. కర్నూలు నగరంతోపాటూ చుట్టు పక్కల గ్రామాల ప్రజల తాగునీటి  సమస్య పరిష్కానికి రూ.65 లక్షలతో ఆయా ప్రాంతాల్లో బోర్లను తవ్వి, గ్రామ ప్రజల మంచినీటి సమస్య తీర్చుతామనని తెలిపారు. ఆయా గ్రామాల్లో నిరంతర తాగునీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కర్నూలు సర్వజన వైద్యశాలో వెంటిలేటర్లు, మల్టీ పారామీటర్‌ మానిటర్లు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు కలిగిన పూర్తిస్థాయి ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ సహృదయంతో అవసరార్థులకు సేవా కార్యక్రమాలను విస్తృతంగా అందించాలని, అదే ప్రజలు తనకు అందించే హృదయపూర్వక ఆశీర్వాదాలని అన్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున సామూహిక వివాహాలు నిర్వహించేవారమని, ఒకసారి ఎన్నికల కోడ్‌, తర్వాత కొవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయామని చెప్పారు. ఈ ఏడాది కూడా తన పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నామని, అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కళాకారులకు సహాయం చేసేందుకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కళాకారులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో టీజీవీ కళాక్షేత్రంను అన్ని హంగులతో ఏర్పాటు చేశామని తెలిపారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఎంపీ టీజీ వెంకటేశ్‌ తన పుట్టినరోజు సందర్భంగా పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు విశ్రాంతి తీసుకునేందుకు, వారి సామగ్రి భద్రపరుచుకునేందుకు అవసరమైన గదిని టీజీవీ కళాక్షేత్రంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీ టీజీ వెంకటేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని రంగాల్లో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యవర్గం సీవీ రెడ్డి, సంగా ఆంజనేయులు, క్రిష్టఫర్‌, ఇనాయతుల్లా, మహ్మద్‌ మియా, లక్ష్మీకాంతరావు, శ్రీనివాసరె డ్డి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:17:42+05:30 IST