Abn logo
Jul 13 2020 @ 09:18AM

కోవిడ్19 ఎఫెక్ట్... సినీ ఇండస్ట్రీలో కొత్త శాఖ ?

కరోనా వైరస్ దెబ్బకు కుదలైన రంగాల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. లాక్‌డౌన్ ప్ర‌క‌టించి దాదాపు ఐదు నెల‌లు పూర్తి కావ‌స్తుంది. ప్రారంభంలో షూటింగ్స్‌ను ఆపు చేశారు. థియేట‌ర్స్‌ను మూసివేశారు. థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌కున్నా.. షూటింగ్స్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం ష‌రతుల‌తో కూడిన అనుమ‌తుల‌ను జారీ చేసింది. అయినా కూడా పూర్తిస్థాయిలో సినీ రంగం ప్రారంభం కాలేదు. అంటే  కోవిడ్ 19 ప్ర‌భావానికి షూటింగ్స్ స్టార్ట్ చేయాలా? వద్దా? అని సినీ ప‌రిశ్ర‌మ‌, సెల‌బ్రిటీలు ఎంత‌గా ఆలోచ‌న‌లో ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు. రీసెంట్‌గా బిగ్‌బీ అమితాబ్ ఫ్యామిలీలో ఆయ‌న స‌హా అభిషేక్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్య‌ల‌కు కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో బాలీవుడ్ స‌హా అన్నీ సినీ ప‌రిశ్ర‌మ‌లు షూటింగ్స్‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. క‌రోనా ప్ర‌భావం నుండి యూనిట్‌ను త‌ప్పించాలంటే ఏం చేయాల‌నే దిశ‌గా మేక‌ర్స్ ఆలోచ‌న‌లు చేస్తున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. 


ఈ క్ర‌మంలో కోవిడ్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్ అనే విభాగాన్ని స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విభాగం ప‌నేంటి? అనే ప్ర‌శ్న రావ‌చ్చు. సినిమా యూనిట్ షూటింగ్ స్టార్ట్ చేసిన‌ప్పుడు అవుట్ డోర్‌లో కానీ, ఇండోర్‌లో కానీ యూనిట్ స‌భ్యులను ఈ విభాగం కోవిడ్ 19 బారిన ప‌డ‌కుండా కోవిడ్ ప్రొటెక్షన్ యూనిట్ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా యూనిట్ కోవిడ్ 19 బారిన ప‌డ‌కుండా లొకేష‌న్‌లో వర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో కోవిడ్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్ ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ సినిమా ‘రాధేశ్యామ్’ యూనిట్ ఈ ప‌ద్ధ‌తిలో షూటింగ్‌ను ప్రారంభించాల‌నుకుంటుంద‌ని టాక్. కెమెరాలు, కాస్ట్యూమ్స్‌ను ప్ర‌త్యేక‌మైన ప‌ద్ధ‌తుల్లో శుభ్ర‌ప‌రుస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 




Advertisement
Advertisement
Advertisement