అతడే నా తండ్రి అంటూ అమెరికా వ్యాపారవేత్తపై కోర్టులో కేసు వేసిన యువతి.. ఇప్పుడేమో..

ABN , First Publish Date - 2022-04-23T05:00:01+05:30 IST

ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త, డాలస్ కౌబాయిస్ రగ్బీ టీం ప్రెసిడెంట్ జెర్రీ జోన్స్ తన తండ్రి అంటూ కోర్టు కెక్కిన టెక్సాస్ యువతి అలెక్సాండ్రా డేవిస్ బుధవారం తన కేసును ఉపసంహరించుకుంది.

అతడే నా తండ్రి అంటూ అమెరికా వ్యాపారవేత్తపై కోర్టులో కేసు వేసిన యువతి.. ఇప్పుడేమో..

ఎన్నారై డెస్క్: ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త, డాలస్ కౌబాయిస్ రగ్బీ టీం ప్రెసిడెంట్ జెర్రీ జోన్స్ తన తండ్రి అంటూ కోర్టు కెక్కిన టెక్సాస్ యువతి అలెక్సాండ్రా డేవిస్ బుధవారం తన కేసును ఉపసంహరించుకుంది. ముందుగా డీఎన్ఏ టెస్టు సాయంతో తన తండ్రి ఎవరనేదానిపై ఆధారలను సిద్ధం చేద్దామనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపింది. జెర్రీయే తన తండ్రి అనే విషయంలో ఇకపై ఎటువంటి సందేహాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అలెక్సాండ్రా తరఫు లారయర్లు కోర్టుకు తెలిపారు. అయితే. అలెక్సాండ్రా పిటిషన్ రద్దు చేయాంటూ జర్రీ తరపు న్యాయవాదులు గతంలోనే కోర్టుకు విన్నవించినా..తన తండ్రి ఎవరనే విషయంలో ఆమె చేస్తున్న ప్రకటనలపై మాత్రం మౌనం దాల్చారు. 


ఇక.. అలెక్సాండ్రా చెబుతున్నా దాని ప్రకారం.. కొన్నేళ్ల క్రితం జెర్రీ జోన్స్‌కు తన తల్లి సింథియా డేవిస్‌తో సంబంధం ఉండేది. అంతేకాకుండా.. తాను అలెక్సాండ్రాకు తండ్రంటూ బహిరంగ ప్రకటనలు చేయనంత కాలం తల్లీకూతూళ్ల ఆర్థికావసరాలు తీరుస్తానంటూ తన తల్లితో జెర్రీ ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది. అయితే.. అలెక్సాండ్రాకు తాను తండ్రిని కానంటూ ఒప్పందం సమయంలోనే స్పష్టం చేసినట్టు జెర్రీ ప్రకటించారు. 

Updated Date - 2022-04-23T05:00:01+05:30 IST