మాస్క్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన టెక్సాస్ గవర్నర్!

ABN , First Publish Date - 2020-07-03T21:48:59+05:30 IST

కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరికాలో కొవిడ్-19 కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్సాస్ గవర్న

మాస్క్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన టెక్సాస్ గవర్నర్!

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరికాలో కొవిడ్-19 కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్సాస్ గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ప్రజలు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. కార్యనిర్వాహకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఒకచోట 10 మందికి మించి ఎక్కువ మంది గుమికూడి ఉండటాన్ని  నిషేధించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాలు సజావుగా సాగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో పక్కన ఉన్న వారిని రక్షించడం కోసం ప్రజలు తప్పని సరిగా మాస్క్ ధరించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. టెక్సాక్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. టెక్సాస్‌లో బుధవారం ఒక్కరోజే 8వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు టెక్సాస్‌లో నమోదైన కేసుల సంఖ్య 1.75లక్షలకు చేరింది. 



Updated Date - 2020-07-03T21:48:59+05:30 IST