టెక్సాస్‌లో ఐదోరోజు కూడా సేమ్ సీన్!

ABN , First Publish Date - 2020-07-19T09:00:38+05:30 IST

అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి

టెక్సాస్‌లో ఐదోరోజు కూడా సేమ్ సీన్!

ఆస్టిన్: అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. టెక్సాస్‌లో వరుసగా ఐదో రోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ హెల్త్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్‌లో గడిచిన 24 గంటల్లో 10,158 కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,17,730కు చేరింది. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 130 మంది మరణించారు. అంతకుముందు రోజు రాష్ట్రంలో అత్యధికంగా 174 మంది మరణించారు. టెక్సాస్‌లో ఇప్పటివరకు 3,865 మంది ప్రాణాలు కోల్పాయరు. గడిచిన ఆరు రోజుల్లోనే 673 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులిచ్చిన మొట్టమొదటి రాష్ట్రం టెక్సాస్ అనే చెప్పాలి. టెక్సాస్ ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిందో అప్పటి నుంచి కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఐసీయూ బెడ్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 37 లక్షలకు పైగా కేసులు నమోదవగా.. లక్షా 40 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-07-19T09:00:38+05:30 IST