Texas man: కొవిడ్ పరీక్ష ఫలితం చూసి కాకుండా బిల్లు చూసి షాక్ అయ్యాడు

ABN , First Publish Date - 2021-10-01T17:24:38+05:30 IST

కొవిడ్-19 మహమ్మారి సందర్భంగా అమెరికా దేశంలో కొవిడ్-19 పరీక్షల ధరలు చూస్తే షాకవ్వాల్సిందే....

Texas man: కొవిడ్ పరీక్ష ఫలితం చూసి కాకుండా బిల్లు చూసి షాక్ అయ్యాడు

టెక్సాస్ (యునైటెడ్ స్టేట్స్): కొవిడ్-19 మహమ్మారి సందర్భంగా అమెరికా దేశంలో కొవిడ్-19 పరీక్షల ధరలు చూస్తే షాకవ్వాల్సిందే.టెక్సాస్‌కు చెందిన ట్రావిన్ వార్నర్ లెవిస్ విల్లేలోని ఒక కేంద్రంలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. కరోనా పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టు చూసి కాకుండా బిల్లు చూసి ట్రావిస్ వార్నర్ షాకయ్యాడు. ట్రావిస్ వార్నర్ యాంటీజెన్ టెస్ట్, ఫెసిలిటీ ఫీజు కింద 54,000 డాలర్ల బిల్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.40లక్షలు వసూలు చేశారు. అమెరికాలో కరోనా పీసీఆర్ పరీక్ష సాధారణంగా 8 నుంచి 15 డాలర్ల ఖర్చు అవుతోంది. కాని కరోనా వ్యాప్తి సమయంలో యునైటెడ్ స్టేట్స్ లో కొవిడ్ పరీక్షల ధరలు ఆకాశన్నంటాయి. 


ఎంతైనా అమెరికా దేశంలో కరోనా వ్యాప్తి కాలమాయె. అయితే ట్రావిస్ వార్నర్ భార్యకు ఉన్న బీమా వల్ల ఆమెకు కొవిడ్ పరీక్షకు 1000డాలర్లకు బిల్లు తగ్గించారట.ఇంటర్నెట్, వీడియో సిస్టమ్ ల ను ఇన్ స్టాల్ చేసే ట్రావిస్ వార్నర్ వ్యాపారం కరోనా మహమ్మారి వల్ల గత నెలలో పెరిగింది. కరోనా వల్ల అమెరికా ప్రజలు నెలల తరబడి మంచాలకు అతుక్కుపోవడంతో ఇంటర్నెట్, వీడియో సిస్టమ్ ల ఇన్ స్టాల్ వ్యాపారం జోరందుకుందని సమాచారం. మొత్తంమీద అమెరికాలో కొవిడ్ పరీక్ష రిపోర్టు చూసి కాకుండా బిల్లు చూసి షాకైన ఉదంతాలు పలు చోటుచేసుకున్నాయి. 

Updated Date - 2021-10-01T17:24:38+05:30 IST