నా వంద ఎకరాలు ఫ్రీగా తీసుకో.. Elon muskకు ఓ రైతు బంపర్ ఆఫర్..!

ABN , First Publish Date - 2022-04-30T03:34:54+05:30 IST

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకుని ఎంతటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నా వంద ఎకరాలు ఫ్రీగా తీసుకో..  Elon muskకు ఓ రైతు బంపర్ ఆఫర్..!

ఎన్నారై డెస్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకుని ఎంతటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం ప్రకంపనలకు దారి తీసింది. అయితే.. ట్విటర్ ఎలాన్ మస్క్ పరమైన మరుసటి రోజే అమెరికాలోని ఓ రైతు సంచలన ఆఫర్ చేశాడు. తన వద్ద ఉన్న వంద ఎకరాలను మస్క్‌కు ఉచితంగా ఇచ్చేస్తానంటూ కలకలం రేపాడు. ఆ రైతు పేరు జిమ్ ష్వెర్టనర్. ఆయన ఉండేది టెక్సాస్ రాష్ట్రంలో! ఆస్టిన్ నగరానికి చెందిన ఈ రైతు 20 వేల ఏకరాలు భూమి ఉన్న ఆసామి. ఇక విలియమ్సన్ కౌంటీలో తనకున్న 100 ఎకరాలను  మస్క్ ఇచ్చేస్తాని ప్రకటించాడు. 


అయితే.. ఈ స్థలంలో మస్క్ తన ట్విటర్ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పాలని కోరాడు. దీని వల్ల స్థానికంగా ఆర్థికరంగం వృద్ధి చెంది, ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చాడు. మరో విశేషమేంటంటే.. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ విషయాన్ని మస్క్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అతడి ఆఫర్ గురించి ఆలోచించాలంటూ మస్క్‌కు సూచించిన ఆయన.. అవసరమనుకుంటే.. ఆ స్థలానికి ట్విటర్ అని నామకరణం చేస్తానని కూడా మాటిచ్చారు.

Updated Date - 2022-04-30T03:34:54+05:30 IST