భారతీయ అమెరికన్ ఫౌండేషన్ ఉదారత !

ABN , First Publish Date - 2021-04-28T17:45:44+05:30 IST

కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కీలక వైద్య పరికరాలు, టీకాల తయారీకి ముడిసరకుల పంపిణీ, ప్రాణవాయువు సరఫరా ఇలా పలు రకాలుగా భారత్‌ను యూఎస్ ఆదుకుంటోంది.

భారతీయ అమెరికన్ ఫౌండేషన్ ఉదారత !

హ్యూస్టన్: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కీలక వైద్య పరికరాలు, టీకాల తయారీకి ముడిసరకుల పంపిణీ, ప్రాణవాయువు సరఫరా ఇలా పలు రకాలుగా భారత్‌ను యూఎస్ ఆదుకుంటోంది. దీనికి తోడు అమెరికాకు చెందిన 40 దిగ్గజ కంపెనీలు సైతం తొలిసారి ఓ టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అలాగే పలువురు భారతీయ అమెరికన్లు, సంస్థలు మాతృ దేశానికి అండగా నిలుస్తున్నాయి. తాజాగా టెక్సాస్‌కు చెందిన ఓ భారతీయ అమెరికన్ ఫౌండేషన్ తన ఉదారతను చాటుకుంది. యూఎస్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్(యూఎస్ఐసీఓసీ) ఫౌండేషన్, దాని అనుబంధ సంస్థలు భారత్‌కు 50 వెంటిలేటర్లను పంపించే ఏర్పాటు చేశాయి.


వీటిలో 20 వెంటిలేటర్లను మంగళవారం భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేయగా, మిగిలిన 30 వెంటిలేటర్లు వచ్చే కొన్ని రోజుల్లో పంపించనున్నట్లు యూఎస్ఐసీఓసీ తెలిపింది. న్యూఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వీటిని పంపించింది. ఇక ఈ వెంటిలేటర్ల పంపిణీలో యూఎస్ఐసీఓసీ డీఎఫ్‌డబ్ల్యూ అధ్యక్షుడు నీల్ గోనుగుంట్ల, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (ఐఏసీసీజీహెచ్) వ్యవస్థాపక కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యూఎస్ఐసీఓసీ వ్యవస్థాపక చైర్మన్ పద్మ శ్రీ అశోక్ మాగో కీలకంగా వ్యవహరించారు. భారతదేశానికి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్స్, జనరేటర్లు, వెంటిలేటర్లు వంటి కీలకమైన వైద్య పరికరాలను అందించడానికి వారు భారతీయ అమెరికన్ సమాజం నుండి నిధులు సేకరించారు.  

Updated Date - 2021-04-28T17:45:44+05:30 IST