ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:28:52+05:30 IST

ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని కేరళ రాష్ట్ర త్రిసూర్‌కు చెందిన డీఐజీ పుట్టా విమలాదిత్య అన్నారు. మం

ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలి
సందేహాలను నివృత్తి చేస్తున్న విమలాదిత్య

కోదాడ రూరల్‌ / నేరేడుచర్ల: ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని కేరళ రాష్ట్ర త్రిసూర్‌కు చెందిన డీఐజీ పుట్టా విమలాదిత్య అన్నారు. మండలంలోని కొమరబండ తేజ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షలపై సందేహాలను విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన నివృత్తి చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమిరెడ్డి, విద్యాలయ అకడమిక్‌ ఇన్‌చార్జి సుధా ప్రసన్న, ప్రిన్సిపాల్‌ రమాదేవి పాల్గొన్నారు. అదేవిధంగా నేరేడుచర్లలోని శ్రీవాణి ఇంగ్లీ్‌షమీడియం స్కూల్‌లోని ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని ఎంఈవో ఛత్రునాయక్‌ పరిశీలించారు. ఆయన వెంట చీఫ్‌ సూపరింటెండెంట్‌లు ఎల్‌. శ్రీనివాసరావు, నట్టె శ్రీనివాసరావు, డిపార్టుమెంటల్‌ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీవాణి స్కూల్‌ డైరక్టర్‌ సీతారాంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:28:52+05:30 IST