మెల్‌బోర్న్, ఫిబ్రవరి 7: కరోనా వైరస్ దాడి చేస్తున్న ప్రధాన అవయవం ఊపిరితిత్తులు. వాటికి రక్షణ కల్పించే సామర్థ్యం ‘హెపారిన్’ అనే ఔషధానికి ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. గుండె శస్త్రచికిత్స, బైపాస్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్ వంటి రుగ్మతలకు చికిత్స అందించే క్రమంలో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ‘హెపారిన్’ను అందిస్తుంటారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు దీన్ని పలువురు కొవిడ్ రోగులకు నెబ్యులైజర్ ద్వారా అందించగా.. ఇన్ఫెక్షన్ తీవ్రతరం కాకుండా నిరోధించడంతో పాటు వారి ఊపిరితిత్తులకు రక్షణ లభించినట్లు గుర్తించారు. హెపారిన్ ప్రభావంతో చాలామంది రోగుల శ్వాస సమస్యలు తగ్గాయని, ఆక్సిజన్ స్థాయులూ పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవి కూడా చదవండి