నిరోధ స్థాయిల్లో పరీక్ష

ABN , First Publish Date - 2022-01-17T09:06:10+05:30 IST

నిరోధ స్థాయిల్లో పరీక్ష

నిరోధ స్థాయిల్లో పరీక్ష

నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో బుల్లిష్‌ ధోరణిలోనే గత వారం ప్రారంభమై అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 440 పాయింట్ల లాభంతో 18250 వద్ద పటిష్ఠంగా ముగిసింది. మానసిక అవధి 18000 వద్ద బ్రేకౌట్‌ సాధించినందు వల్ల పుల్‌బ్యాక్‌ ఆస్కారం ఉంది. గత నాలుగు వారాల్లో నిట్టనిలువుగా 2000 పాయిం ట్ల మేరకు ఆకస్మిక అప్‌ట్రెండ్‌ సాధించినందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. రియాక్షన్‌లో పడినా 18000 వద్ద పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది. 

బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడయితే అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 18350 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 18600.

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌లో పడి 18100 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనతను సూచిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 17950. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ బౌన్స్‌బ్యాక్‌ సాధించాలి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించి స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 630 పాయిం ట్ల మేరకు ర్యాలీ సాధించినా వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యన ముగియడం అనిశ్చితిని సూచిస్తోంది. ప్రధాన స్థాయి 39000 వద్ద స్వల్ప రియాక్షన్‌ కనబరుస్తోంది. అలాగే 38000 వద్ద మైనర్‌ రికవరీ కూడా ఉంది. ఈ వారంలో గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌ ఆస్కారం ఉంది. మరింత బలహీనత ప్రదర్శించినా 38000 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. 

పాటర్న్‌: నిఫ్టీ ఇప్పుడు గతంలో సాధించిన మేజర్‌ టాప్‌ 18200 వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. రాబోయే ఒకటి, రెండు రోజుల్లోనూ ఈ స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఆర్‌ఎ్‌సఐ సూచీల్లో డెయిలీ చార్టుల ప్రకారం స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఉన్నందు వల్ల ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ ప్రస్తుతం 18000-17950 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన ఉండడం స్వల్పకాలిక సానుకూల ధోరణి సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 18260, 18310

మద్దతు : 18180, 18100


www.sundartrends.in

Updated Date - 2022-01-17T09:06:10+05:30 IST