Twitter సీఈవో పరాగ్ అగర్వాల్‌కి Elon Musk వార్నింగ్

ABN , First Publish Date - 2022-07-15T20:54:18+05:30 IST

ఏకంగా 44 బిలియన్ డాలర్లుపైబడిన ట్విటర్- మస్క్ డీల్ రద్దుపై(Twitter - Musk deal) డ్రామా కొనసాగుతోంది.

Twitter సీఈవో పరాగ్ అగర్వాల్‌కి Elon Musk వార్నింగ్

న్యూఢిల్లీ : ఏకంగా 44 బిలియన్ డాలర్లుపైబడిన ట్విటర్- మస్క్ డీల్ రద్దుపై(Twitter - Musk deal) డ్రామా కొనసాగుతోంది. ఒప్పందం రద్దు చేసుకోవడానికి ముందు ట్విటర్(Twitter ) సీఈవో పరాగ్ అగర్వాల్‌(pawag Agarwal)కు టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) వార్నింగ్ (Warning) ఇచ్చారని లాయర్లు కోర్టుకి వెల్లడించారు. ‘‘ ట్విటర్ యూజర్లలో నకిలీ లేదా స్పామ్ అకౌంట్ల  5 శాతం కంటే తక్కువున్నాయనే సమాచారం అడగడంతో నన్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఆటంకాలు సృష్టించడంపై మీ లాయర్లు(Lawyers) చర్చిస్తున్నారు. వాటిని ఆపేయండి ’’ అని హెచ్చరిస్తూ పరాగ్ అగర్వాల్‌, ట్విటర్  సీఎఫ్‌వో నెడ్ సెగల్‌కి జులై 8న ఎలాన్ మస్క్ సందేశం పంపించారని లాయర్లు వివరించారు. ట్విటర్ డీల్ రద్దు చేసుకోవడానికి ముందే మస్క్ ఈ హెచ్చరికలు పంపారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేయడానికి నిధులు ఏవిధంగా సమకూర్చుకోబోతున్నారని కోరగా ఆయన నుంచి ఈ విధమైన రిప్లై వచ్చిందని వివరించారు.


మస్క్‌పై ట్విటర్ దావా..

ఏకంగా 44 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్‌పై(Elon Musk) ట్విటర్(Twitter) కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో ఇటివలే దావా వేసింది. నీతినిజాయితీలేని చర్యలతో ట్విటర్‌కు పూడ్చలేని నష్టాన్ని తెచ్చిపెట్టారని మస్క్‌ని విమర్శించింది. ట్విటర్ షేర్లు అపార నష్టాన్ని చవిచూడడానికి మస్క్ చర్యలే కారణమని పిటిషన్‌లో తీవ్ర విమర్శలు చేసింది.  ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మస్క్ ఉల్లంఘించారని, ఒప్పందం కారణంగా స్టాక్ హోల్డర్లు దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపించడంలేదని వాపోయింది. ‘‘ ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ప్రతిపాదించాడు. ఒప్పందంపై సంతకం చేశాడు. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలిగారు. చట్టాలను మార్చేయవచ్చునని మస్క్ భావిస్తున్నారు. ట్విటర్‌ని తీవ్రంగా నష్టపరిచారు. కార్యకలాపాలు, స్టాక్ హోల్డర్ల వ్యాల్యూలను తీవ్రంగా దెబ్బతీశారు’’ అని దావాలో పేర్కొంది. ఈ మేరకు డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో పిటిషన్ వేసింది. ఈ కోర్టు బిజినెస్ వివాదాలను పరిష్కరిస్తుంది.

Updated Date - 2022-07-15T20:54:18+05:30 IST