కశ్మీర్‌లో మరుగుదొడ్డి గుంతల్లో ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2020-09-28T08:22:50+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బలగాల కళ్లు కప్పేందుకు స్థానికుల ఇళ్లలోని మరుగుదొడ్డి గుంతలో దాక్కొంటున్నారు...

కశ్మీర్‌లో మరుగుదొడ్డి గుంతల్లో ఉగ్రవాదులు

  • బలగాల కళ్లు కప్పేందుకు ముష్కరుల వ్యూహం


శ్రీనగర్‌, సెప్టెంబరు 27: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బలగాల కళ్లు కప్పేందుకు స్థానికుల ఇళ్లలోని మరుగుదొడ్డి గుంతలో దాక్కొంటున్నారు. స్థానికులతో కలిసి ఉంటే బలగాలకు సలభంగా దొరికిపోయే ముప్పు ఎక్కువగా ఉండడం, గత కొన్నేళ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో భారీఎత్తున సహచర ఉగ్రవాదులు హతమవడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముష్కరులు టాయిలెట్‌ గుంతల్లో దాక్కొంటున్నారని కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.  

Updated Date - 2020-09-28T08:22:50+05:30 IST