Jammu And Kashmir : ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2021-10-11T12:52:02+05:30 IST

జమ్మూకశ్మీరులోని అనంతనాగ్ లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతం అయ్యాడు...

Jammu And Kashmir : ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని అనంతనాగ్ లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతం అయ్యాడు.అనంతనాగ్ లోని ఖగుండ్, వేరినాగ్ ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలతో కలిసి జమ్మూకశ్మీర్ పోలీసులు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని కశ్మీర్ జోన్ పోలీసులు సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.ఈ ఎదురుకాల్పుల్లో ఒక గుర్తు తెలియని ఉగ్రవాది మరణించారు.ఈ ఎన్‌కౌంటరులో ఒక పోలీసు కూడా గాయపడ్డారు. గాయపడిన పోలీసును ఆసుపత్రికి తరలించారు. అనంతనాగ్ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఇంకా గాలిస్తున్నారు.


Updated Date - 2021-10-11T12:52:02+05:30 IST