జాతీయ జెండాను ఎగురవేసిన ఉగ్రవాది తండ్రి

ABN , First Publish Date - 2021-08-15T18:19:25+05:30 IST

జమ్మూ-కశ్మీరులో 2016లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో

జాతీయ జెండాను ఎగురవేసిన ఉగ్రవాది తండ్రి

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో 2016లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా టీచర్ అయిన ముజఫర్ పుల్వామా జిల్లా, ట్రాల్‌లోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వనీ భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2016 జూలైలో మరణించాడు. దీంతో కశ్మీరులో ఐదు నెలలపాటు జరిగిన ఆందోళనల్లో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. 


భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో అన్నిశాఖల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించాలని జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించారు.


Updated Date - 2021-08-15T18:19:25+05:30 IST