Jammu and Kashmirలో ఉగ్రవాది అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-27T14:46:03+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు....

Jammu and Kashmirలో ఉగ్రవాది అరెస్ట్

 చైనా తుపాకీ, మందుగుండు సామాగ్రి స్వాధీనం 

దోడా: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఉగ్రవాది ఫరీద్ అహ్మద్ కోటి దోడా నివాసిగా గుర్తించారు. ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.అమర్‌నాథ్ యాత్రకు ముందు పోలీసు పార్టీ దోడా పట్టణం శివార్లలో చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు చేయగా ఆయుధాలు,మందుగుండు సామగ్రిని తీసుకువెళుతున్న వ్యక్తి దొరికాడు.నిందితుడిని అరెస్టు చేశారు. 


ఫరీద్ మార్చినెలలో ఒక అనుమానితుడి నుంచి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దోడాలోని పోలీసు సిబ్బందిపై దాడి చేసేందుకు వ్యూహం పన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద సంస్థల కోసం ఫరీద్ అహ్మద్ పని చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-06-27T14:46:03+05:30 IST