పార్వతీపురం: పార్వతీపురం మన్యం (Parvathipuram manyam district) జిల్లాలోని వీరఘట్టాంలో విషాదం చోటు చేసుకుంది. బస్సులో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్న మహిళకు జీవితంలో కోలుకో లేని దెబ్బ తగిలింది. పేలూరి పైడితల్లి అనే మహిళ బస్సులో కూర్చొని చేయి బయటపెట్టడంతో బస్సు పక్క నుంచి వెళుతున్న ఆటో ఢీకొని మహిళ చేయి తెగిపడింది. ఈ ఘటనతో తోటి ప్రయాణీకులు హడలెత్తిపోయారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వీరఘట్టాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవి కూడా చదవండి