వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కనిపించని నిబంధనలు

ABN , First Publish Date - 2021-05-11T04:18:44+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మొదట ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేయించుకోండి అని చెబితే వినని ప్రజలు కరోనా విల య తండావం చేస్తుండటంతో కేంద్రాలకు టీకా వేయించుకునేందుకు ఉదయం 8గంటల నుంచే క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కనిపించని నిబంధనలు
వ్యాక్సిన్‌ కోసం గుంపుగా వచ్చిన ప్రజలు

అచ్చంపేట టౌన్‌, మే 10: కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మొదట  ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేయించుకోండి అని  చెబితే వినని ప్రజలు కరోనా విల య తండావం చేస్తుండటంతో కేంద్రాలకు టీకా వేయించుకునేందుకు ఉదయం 8గంటల నుంచే క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. రోజుకు 100టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్‌ వేస్తుండటంతో ప్రజలు ఎవరూ కరోనా నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా ని లబడుతు న్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలకు  అయితే ఉదయం 6గంటల నుంచే వేచి ఉంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లేనివారికి కూడా కరోనా వచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. 50 నుంచి 100మందికి  నిర్ధారణ పరీక్షలు చేయడం వల్ల కరోనా వచ్చిన వారు కూడా టెస్టుల కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

Updated Date - 2021-05-11T04:18:44+05:30 IST